ఆంధ్రప్రదేశ్

కూకట్‌పల్లి పోలీసు అధికారులకు దీపావళి శుభాకాంక్షలు

కూకట్‌పల్లి పోలీసు అధికారులకు దీపావళి శుభాకాంక్షలు

శాలువాలతో సన్మానించి మిఠాయిలు అందజేసిన రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు జనం న్యూస్ నవంబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి దీపావళి పండుగను పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ సీఐ డి. స్వామి గౌడ్‌ను, ఎస్‌ఐలు రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్, నర్మదా మేడంలను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు శాలువాలు కప్పి, మిఠాయిలు అందజేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వి. తాండవ కృష్ణ, జి. ప్రసాద్, చందు సాగర్, నాని తదితరులు పాల్గొని పోలీసు అధికారులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ డి. స్వామి గౌడ్ మాట్లాడుతూ.. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పోలీసు అధికారుల సేవలు అభినందనీయమని అన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న సీఐతో పాటు ఎస్‌ఐలకు పేరుపేరునా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ మర్యాదపూర్వక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

ఇ-పేపర్