జనం న్యూస్ 10 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ము రికినీటితో పంట బతికించుకుంటుంటే బెదిరింపులు.. దారికాచి రూ. 10 వేల అక్రమ వసూళ్లు ఇండ్లల్లో వాడిన మురికి నీరు వృథాగా వెళ్తే పంటకు పారించుకునేందుకు పర్మిషన్ కావాలా జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజ మండలం లో (తుపత్రాల) నడిగడ్డ ముచ్చట్లు కొద్దిసేపటి క్రితం ఐజ మండలం తుపత్రాల పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘోరం వెలుగులోకి వచ్చింది వాగు నుండి నీటిని తీసుకెళ్తుంటే ఆర్ టి ఓ అధికారులు ట్యాంకర్లు ఆపి డబ్బులు వసూలు చేసిన ఘటన కలకలం రేపింది గద్వాల ఆర్టీఓ అధికారుల దౌర్జన్యాన్ని చూసి స్థానిక ప్రజలు, రైతాంగం ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు మురికినీరే ఆధారం. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో చుక్క వర్షం లేక సాగునీరు అందక తెలంగాణలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ క్రమంలో తుపత్రాల గ్రామానికి చెందిన మిరప రైతులు రోజుకు వేలాది రూపాయలు అప్పులు చేసి, ఐజా పెద్దవాగు పారే మురికి నీటిని కిరాయి ట్రాక్టర్లు-ట్యాంకర్ల ద్వారా పొలాలకు తరలించుకుంటున్నారు. కాగా కొద్దిసేపటి క్రితం ఆ ట్యాంకర్లను గద్వాల ఆర్టీఓ అధికారులు రోడ్డుపైనే అడ్డగోలుగా నిలిపివేశారు రూ. 1.5 లక్షల ఫైన్ బెదిరింపు దారికాచి వసూళ్లు ఒక్కో ట్రాక్టర్కు రూ. 1,50,000 ఫైన్ వేస్తాం పోలీస్ స్టేషన్కు గుంజుకెళ్తాం అని బెదిరించి పేద రైతుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ. 10,000 చొప్పున అక్రమంగా గుంజుకెళ్లారు అధికారుల రాక్షసత్వానికి భయపడిపోయిన రైతులు ప్రస్తుతం నీటి తరలింపును నిలిపివేసి తమ ట్రాక్టర్లను దాచిపెట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది! ప్రజలకు అండగా నిలవాల్సిన సర్కారే దోచుకుంటుందా నీరు అందించాల్సింది పోయి, పంటను కాపాడుకోవడానికి తెచ్చుకుంటున్న నీటిని కూడా అడ్డుకుని రైతుల జేబులు కొట్టడం ఎంతవరకు న్యాయం ఈ అక్రమ దోపిడీపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సదరు ఆర్టీఓ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి.