తెలంగాణ

ఇచ్చేదే గుక్కెడు నీళ్ళు అవికూడా దుర్వాసన తో కూడిన మురుగు నీరు జనసేన నాయకులు:కొల్లా శంకర్

ఇచ్చేదే గుక్కెడు నీళ్ళు అవికూడా దుర్వాసన తో కూడిన మురుగు నీరు జనసేన నాయకులు:కొల్లా శంకర్

జనం న్యూస్ నవంబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కేపీహెబి 4వ ఫేస్ గత కొన్ని నెలలుగా వేధిస్తున్న తాగునీటి సమస్యపై ఎల్ఐజి కాలనీవాసులు జనసేన కూకట్పల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ దృష్టికి వారి యొక్క త్రాగునీటి సమస్యను తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రేమకుమార్ సూచనలు మేరకు జనసేన పార్టీ కూకట్పల్లి కోఆర్డినేటర్ కొల్లాశంకర్ ఈ రోజు తాగునీటి సమస్యపై స్థానిక ప్రజలతో కలిసి వాటర్ బోర్డు డిజియమ్ త్రినాథరావు ని కలిశారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను జనసేన నాయకులు కొల్లా శంకర్ వివరిస్తూ తాగునీటిలో మురుగునీరు కలవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారాని నీటి సరఫరా ప్రారంభమైన 30 నిమిషాల్లో మొదటి పది నిమిషాలు కలుషితమైన మురికినీరే వస్తోందని, ఆ తర్వాతే మంచి నీరు వస్తుందని,స్థానిక ప్రజలు అనారోగ్యానికి పాల్పడుతున్నారని, ప్రజల ఆరోగ్యం పై దృష్టి సారించాలని ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని త్రినాథరావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ తీవ్రమైన సమస్యపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. జనసేన నాయకులు తెలిపిన సమస్యపై త్రినాథరావు తక్షణమే సానుకూలంగా స్పందించారు. నెల రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అదే విధంగా, స్థానిక ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని, తాగునీటిని వృథా చేయవద్దని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆళ్ల నరేంద్ర, పుప్పాల అంజి, దాసరి వెంకట్ మరియు కాలనీ మహిళలు పాల్గొన్నారు.

ఇ-పేపర్