ఆంధ్రప్రదేశ్

కాట్రేనికోనలో విలేఖర్ రాజుకు ఘన సత్కారం, అభినందనల వెల్లువ

కాట్రేనికోనలో విలేఖర్ రాజుకు ఘన సత్కారం, అభినందనల వెల్లువ

జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండల పరిధిలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన విలేఖర్ రాజుకు కాట్రేనికోనలో ఘనంగా అభినందనలు, సత్కారం జరిగాయి. కాట్రేనికోన ఎంపీటీసీ పిఎస్ఎన్ రాజు కార్యకర్తలు, యువకులు విలేఖర్ రాజుకు శాలువ వేసి పూల మొక్కలతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పండితులచే వేద ఆశీర్వచనం చేయించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ శాలువ వేసి ఘనంగా సత్కరించారు. కాట్రేనికోనలోని ఆయన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలవరపు చంటి, వంగ దుర్గ బాబు, ఏ పనికాంత్, కోపానతి కిరణ్, సింహాద్రి గణేష్, పసర్ల శీను తదితరులు కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. విలేఖర్ రాజు విజయం కూటమి ఐక్యతకు, కార్యకర్తల కృషికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. ఆయన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. విలేఖర్ రాజుకు మరిన్ని ఉన్నత అవకాశాలు రావాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని అభిమానులు కోరుకున్నారు. ఈ సందర్భంగా స్వగృహం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

ఇ-పేపర్