జనం న్యూస్ 17 నవంబర్ 2026( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఈరోజు ఉదయం స్థానిక ఎల్కతుర్తి మండలంలో ఉన్న బాలికల ఎస్సీ గురుకుల పాఠశాలను సందర్శించిన బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు.
పాఠశాల ఆవరణాన్ని మరియు పిల్లలు తీసుకునే ఆహారాన్ని అదేవిధంగా చుట్టూ పరిసరాలు పరీక్షించి స్థానిక ప్రిన్సిపాల్ అన్నపూర్ణ ను పిల్లల యొక్క విద్య మరియు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మంత్రి పరిశీలనలో అన్ని సక్రమంగా ఉన్నాయని ప్రిన్సిపాల్ గారిని అభినందించడం జరిగింది . అదేవిధంగా ఆటలలో ప్రైస్ తీసుకున్న విద్యార్థులను సన్మానించడం జరిగింది . ఈ విషయంపై ప్రిన్సిపాల్ స్పందిస్తూ మా పాఠశాలను గౌరవ మంత్రివర్యులు సందర్శించడం చాలా సంతోషంకరవిషయమని తమ సంతోషాన్ని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి తిరుపతి తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.