విజయలక్ష్మి బాలచంద్రయ్య శెట్టి, రూ. 1,40,000 భాగ్యలక్ష్మి సుధాకర్ గౌడు 1,40,000 చెక్కును అందజేసిన కాంగ్రెస్ నాయకులు. జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ లబ్ధిదారునికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు._ పెబ్బేరు పట్టణానికి చెందిన (1.విజయలక్ష్మి,) (2. భాగ్యలక్ష్మి సుధాకర్ గౌడ్) కీళ్లు మార్పిడి ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఈ వైద్య ఖర్చుల నిమిత్తం ఆమె స్థానిక నాయకుల దృష్టికి తీసుకుపోగా నాయకులు వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డిని ఆశ్రయించగా, ఆయన సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆసుపత్రి బిల్లులను ప్రభుత్వానికి సమర్పించగా, ప్రభుత్వం స్పందించి రూ. 2,80,000/- మంజూరు చేసింది.ఈ మంజూరైన చెక్కును మంగళవారం పట్టణ కాంగ్రెస్ నాయకుడు షకీల్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, సద్దాం హుస్సేన్, వడ్డే అంజి తదితరులు నేరుగా లబ్ధిదారురాలు విజయలక్ష్మికి అందజేశారు. _ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. పేదల ఆరోగ్య సంరక్షణకు, అత్యవసర వైద్య సహాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు ఎంతో అండగా నిలుస్తోందని, అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.