విద్యార్థులకు విద్య ప్రాముఖ్యతను వివరించిన నాయకులు జనం న్యూస్ నవంబర్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భరత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి. నాగిరెడ్డి ఆధ్వర్యంలో భరత్ నగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో భారత తొలి ప్రధానమంత్రి, భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి నియోజకవర్గ బి-బ్లాక్ అధ్యక్షుడు తూము వేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేరి సతీష్, బాలాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సాధు ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన సేవలు చిరస్మరణీయమని, విద్యా రంగానికి ఆయన అందించిన ప్రాధాన్యత భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అసోసియేషన్ సభ్యులు నెహ్రూ ఆశయాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ కొండల్ రెడ్డి, మేకల మైఖేల్, మొయిస్, తమ్మినేని ప్రవీణ్ కుమార్, కళ్యాణ్ బాబు, యూత్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్, శ్రీధర్ చారి, భరత్ నగర్ కాలనీ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే వెల్ఫేర్ కమిటీ సభ్యులు నరేష్ బాబు, రాజు, నాగేశ్వరరావు, శీను, పెద్దబాబు, డేవిడ్, భిక్షపతి గౌడ్, రత్నారావు, రమేష్, మహిళలు అమృత, అనూష, లావణ్య, కవిత, ఆలయ కమిటీ చైర్మన్ మూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రదీప్, ఉపాధ్యాయులు, కాలనీ పెద్దలు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.