జనం న్యూస్ నవంబర్ 17, ఝరాసంగం సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద, మంగళవారం చేయుట పెన్షన్ల మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 586 మంది నూతన పెన్షన్ లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను, ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి మంజుల, తహసిల్దార్ భాస్కర్, మండల కాంగ్రెస్ పార్టీ పెద్దలు హనుమంతరావు పాటిల్, సంగమేశ్వర స్వామి మందిరం చైర్మన్, చంద్రశేఖర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఈ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్లు ఎంతో ఆసరగా ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చూస్తామని ఇంకా ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెన్షన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు ప్రతి నెల వచ్చే పెన్షన్ తమకు ఎంత ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.