జనం న్యూస్ నవంబర్ 19 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట్ మండలం లో బుధవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 206 మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీబీపేట్ సర్పంచ్ సాత్విక సాయినాథ్, సొసైటీ చైర్మన్ సుతారి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, వివిధ గ్రామాల సర్పంచులు హరిష్, మట్ట శ్రీను, ధరణి లక్ష్మి, మమతా,రాజేష్, తోట రమేష్, రాజు, స్వామి, మహేష్, నర్సాపూర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.