బాధిత కుటుంబానికి బియ్యం సహాయం !! జనం న్యూస్ 18 నవంబర్ బుధవారం సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ సిద్ధిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయిన బొమ్మ వెంకటవ్వ కుటుంబాన్ని, బహుజన మిత్రుల ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది. వెంకటవ్వ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, చేయూత కోసం సహాయంగా 50 కిలోల బియ్యన్ని అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన మిత్రులతో పాటు బాధిత కుటుంబసభ్యులు మరియు గ్రామ పెద్దలు యువకులు ఉన్నారు.