జనం న్యూస్ నవంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కూటమి మేయర్ అభ్యర్థిగా ఎంపికైన దేవిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ ఇంఛార్జ్ మెట్ల రమణబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని, నగర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తామని మెట్ల రమణబాబు పేర్కొన్నారు. మేయర్ అభ్యర్థిగా దేవి విజయం సాధించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బిజెపి సీనియర్ నాయకులు కోడూరి లక్ష్మి నారాయణ, బిజెపి రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, సీబీఎఫ్సీ హైదరాబాద్ రీజియన్ అడ్వైజరీ ప్యానెల్ సభ్యుడు వీరన్న చౌదరి నీరుకొండ, 28వ వార్డ్ కౌన్సిలర్ మోకా వెంకట సుబ్బారావు, బిజెపి నాయకులు కరెడ్ల దేవి, బిజెపి సీనియర్ నాయకులు ఆకుల శ్రీధర్, బిజెపి సీనియర్ నాయకులు హారిక, బిజెపి సీనియర్ నాయకులు రొంగొలి గోపి, శ్రీను వాసు, మాజీ కౌన్సిలర్ బొర్రా చిట్టిబాబు, పెదిరెడ్డి నాయుడు, గంధం శ్రీను, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవికి తమ మద్దతు ప్రకటించారు.