జనం న్యూస్ 19 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్క రువు సమయంలో రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పించుకోవడం ఆపాలి జోగులాంబ గద్వాల జిల్లా రైతుల పంట రుణాల సమస్యపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు బ్యాంకుల్లో రైతులకు కొత్త పంట రుణాలు మంజూరు చేయకపోవడం, గతంలో తీసుకున్న రుణాలను రెన్యువల్ చేయకపోవడం వల్ల రైతులు నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరువు పరిస్థితులతో నష్టపోతున్న రైతులకు బ్యాంకుల నుంచి కూడా రుణ సహకారం అందకపోవడం బాధాకరం. రైతులకు సకాలంలో పెట్టుబడి అందకపోతే వ్యవసాయం ఎలా సాగుతుంది
మా డిమాండ్లు: అర్హులైన రైతులకు వెంటనే కొత్త పంట రుణాలు మంజూరు చేయాలి. పెండింగ్లో ఉన్న అర్హులైన రైతుల పంట రుణాల రెన్యువల్ ప్రక్రియను వేగవంతం చేయాలి. కరువు ప్రభావిత ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం రుణాల రీషెడ్యూలింగ్ చేపట్టాలి. బ్యాంకుల అధికారులు రైతులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా సమస్యలను పరిష్కరించాలి రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. జిల్లా కలెక్టర్ లీడ్ బ్యాంక్ అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలి రైతును ఆదుకోండి వ్యవసాయాన్ని కాపాడండి ఇట్లు, సింధనూర్ ఉప్పరి గంగాధర్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ.