జనం న్యూస్ 20 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్మొ దటి విడతలో 84 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శిబిరాలు గ్రామాలు వారీగా శిబిరాల ఏర్పాటు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్జి ల్లాలో ఇందిరమ్మ బీమా పథకం కింద అర్హులైన లబ్ధిదారుల నమోదు ప్రక్రియను దశలవారీగా చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.మొదటి విడతలో భాగంగా జిల్లాలోని 84 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి,నవంబర్ 20వ తేదీ నుంచి ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.మండలాలు, గ్రామ పంచాయతీల వారీగా శిబిరాల నిర్వహణకు తేదీలు, ప్రదేశాలను నిర్ణయించి సంబంధిత సిబ్బందికి బాధ్యతలు కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో నిర్ణయించిన తేదీల్లో కేటాయించిన ప్రదేశాల్లో శిబిరాలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ముందస్తుగా సమాచారం అందించి నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మండలాల వారీగా గ్రామ పంచాయతీలు, శిబిరాల నిర్వహణ ప్రదేశాలు తేదీల వివరాలు:
ఉండవెల్లి మండలం: కల్గొట్ల, కంచుపాడు పుల్లూరు తక్కశిల గ్రామాల్లో రైతు వేదికలో నవంబర్ 20వ తేదీన,ఉండవెల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నవంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు శిబిరాలు నిర్వహించనున్నారు.
గద్వాల మండలం బసాపూర్ బస్రాచెరువు గుంటిపల్లి జిలడబండ లత్తిపురం పరుమాళ రేపల్లి,సంగాల గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఎర్రవల్లి గ్రామంలో ఎంపీయూపీఎస్ పాఠశాలలో తెలుగు వారిపల్లిలో కమ్యూనిటీ హాల్లో నవంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు శిబిరాలు నిర్వహించనున్నారు. అయిజ మండలం కొత్తపల్లి గ్రామంలో ఎంపీయూపీఎస్ పాఠశాలలో బైనపల్లి జడదొడ్డి బింగిదొడ్డి ఏక్లాస్పూర్ ఉతనూర్ ఉప్పల క్యాంప్ వెనిసోంపూర్ నౌరోజీ క్యాంప్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నవంబర్ 20వ తేదీన శిబిరాలు నిర్వహించనున్నారు. కేటీ దొడ్డి మండలం గువ్వలదిన్నె ఎర్సందొడ్డి వెంకటాపూర్ కాలూరుతిమన్ దొడ్డి, గంగనపల్లి పాతపాలెం, పాగుంట, నందిన్నె గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు శిబిరాలు నిర్వహించనున్నారు. మానవపాడు మండలం: నారాయణపూర్, గోకులపాడు, పెద్దముద్దలపాడు, చంద్రశేఖర్ నగర్, చందూర్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, కల్కుంట్ల గ్రామంలో రైతు వేదికలో నవంబర్ 20వ తేదీన శిబిరాలు నిర్వహించనున్నారు. ఎర్రవల్లి మండలం: కొడందాపురం, కొండైర్, తిమ్మాపూర్, బి. వీరాపూర్, ఎర్రవల్లి గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నవంబర్ 20వ తేదీన శిబిరాలు నిర్వహించనున్నారు. అలంపూర్ మండలం: లింగనవాయి, బుక్కాపూర్ గ్రామాల్లో రైతు వేదికల్లో, సుల్తాన్పూర్, సింగవరం, జిలెల్లపాడు గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నవంబర్ 20వ తేదీన శిబిరాలు నిర్వహించనున్నారు. రాజోలి మండలం: రాజోలి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం మరియు న్యూ కాలనీలోని లైబ్రరీ గదిలో, పెద్ద ధన్వాడ, మండొడ్డి గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నవంబర్ 20వ తేదీన శిబిరాలు నిర్వహించనున్నారు. మల్దకల్ మండలం: అడవిరావులచెరువు, డి. అమరవాయి, చర్లగార్లపాడు, బిజ్జవరం, మల్దకల్, పాల్వాయి, శ్యాసంపల్లె గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, విఠలాపురం గ్రామంలో రైతు వేదికలో నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు శిబిరాలు నిర్వహించనున్నారు. ధరూర్ మండలం: బూరెడ్డిపల్లి, పాల్చర్ల, రేవులపల్లి, గుడ్డెందొడ్డి, నగర్దొడ్డి, ద్యాగదొడ్డి, కంభంపాడు గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ఒబులవానిపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద, ర్యాలంపాడు గ్రామంలో పాత డ్వాక్రా భవనం ఎదుట నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు శిబిరాలు నిర్వహించనున్నారు. వడ్డేపల్లి మండలం: వడ్డేపల్లి మండల పరిధిలోని వెంకట్రాంనగర్,జిల్లెడిన్నె గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, బుడమర్సు గ్రామంలో వీవో భవనంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటిక్యాల మండలం: శెనిగపల్లి, శివనంపల్లి, మునగాల, బుద్దారెడ్డిపల్లి, చాగాపూర్ గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు శిబిరాలు నిర్వహించనున్నారు. గట్టు మండలం: మల్లంపల్లి, చిన్నోనిపల్లి, గంగిమండొడ్డి, ముచ్చోనిపల్లి, తరాపురం, వోయలకుంటతండా, ఎల్లందొడ్డి, తుమ్మలపల్లి గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు శిబిరాలు నిర్వహించనున్నారు. ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియను నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో కేటాయించిన సిబ్బంది అందుబాటులో ఉండి అర్హులైన లబ్ధిదారుల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని, అన్ని గ్రామాల్లో శిబిరాలు సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు తమ గ్రామాలకు కేటాయించిన తేదీల్లో సంబంధిత శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.