ఆంధ్రప్రదేశ్

విశాఖ తిరుపతి వందే భారత్ అనకాపల్లి లో హాల్ట్ కోసం విజ్ఞప్తి – కొణతాల వెంకటరావు

విశాఖ తిరుపతి వందే భారత్ అనకాపల్లి లో హాల్ట్ కోసం విజ్ఞప్తి – కొణతాల వెంకటరావు

జనం న్యూస్ నవంబర్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విశాఖపట్నం కి విభజన చట్టంలో విశాఖ రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్ర ప్రయాణికులకు కొత్త ట్రైన్లు దూరప్రాంతాలకు వెళ్లే ప్రాంతాలకు హాల్టిలు వస్తాయని అనకాపల్లి నుండి ప్రయాణం చేయడానికి ప్రయోజనం కలుగుతుందని భావించే ప్రయాణికులకు తీవ్ర నిరాశ కలుగుతుందని ఏ కొత్త ట్రైన్ వచ్చిన అనకాపల్లికి హాల్ట్ లేకపోవడం ప్రజాప్రతినిధులను సంప్రదించకపోవడం రైల్వే అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొణతాల వెంకటరావు అన్నారు. విశాఖపట్నం నుంచి బయలుదేరే వందే భారత్ తిరుపతి వెళ్లే కొత్త ట్రైన్ కు అనకాపల్లిలో హాల్ట్ లేకపోవడం తీవ్ర నిరాశ కలుగ చేస్తుందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ప్రజా ప్రతినిధులు రైల్వే ఉన్నత అధికారులు అనకాపల్లిలో హాల్టి కోసం ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా, ఏజెన్సీ ప్రాంతాల నుండి కూడా సుమారు 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతం నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ నుండి ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారని ఆదాయం కూడా ప్రతిరోజు లక్షల్లో వస్తుందని ఇటువంటి ప్రాంతాన్ని రైల్వే అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదని వెంకటరావు అన్నారు. అనకాపల్లి ప్రాంతం నుండి యాత్రకులు ఇటు తమిళనాడుకు అరుణాచలo మధుర రామేశ్వరం వెస్ట్ బెంగాల్ కు ఉత్తరాఖండ్ చారుదమ్ యాత్ర కు గోవా, అస్సాం వంటి ప్రాంతాలకు తీర్థయాత్రలకు, మరియు పర్యాటక ప్రాంతాల సందర్శనం చేస్తూ ఉన్నారని, వాస్కోడిగామా, అరుణాచలం కార్తీకదీపం ఎక్స్ప్రెస్, విశాఖ యశ్వంత్పూర్ అస్సాం వెళ్లే వీక్లీ ట్రైన్స్ కు హాల్ట్ కోసం ప్రయత్నం చేయాలని ప్రజాప్రతినిధులకు రైల్వే అధికారులను వెంకటరావు కోరారు. గతంలో కంటే ఇప్పుడు అనకాపల్లి నుండి తిరుపతికి, హైదరాబాద్ కు సోలాపూర్ కు కొత్త ట్రైన్లు ప్రవేశపెట్టి అనకాపల్లి జిల్లా ప్రాంత ప్రజలకు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించిన పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ కు జిల్లా ప్రజాప్రతినిధులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని వెంకటరావు అన్నారు.

ఇ-పేపర్