ఆంధ్రప్రదేశ్

దామెరా గ్రామంలో కడారి ఆదం తన వ్యవసాయ భూమి వద్ద చెట్టు కు ఉరి వేసుకుని మృతి.

దామెరా గ్రామంలో కడారి ఆదం తన వ్యవసాయ భూమి వద్ద చెట్టు కు ఉరి వేసుకుని మృతి.

జనం న్యూస్ 21 నవంబర్ 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) దామెర గ్రామానికి చెందిన కడారి ఆదాం, తండ్రి: ఎల్లయ్య, వయసు: 79 సంవత్సరాలు , కులం : మాదిగ అనే వ్యక్తి గత కొంతకాలం నుండి TB వ్యాధి తో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు . ప్రస్తుతం ఇట్టి వ్యాధి ఎక్కువ అవ్వడం వల్ల దగ్గు , తుమ్ములు విపరీతంగా రావడం వల్ల , అట్టి అనారోగ్యా సమస్యని తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది, మనస్థాపంతో ఈరోజు 21/ 11/ 2026 రోజున ఉదయం అందాజా ఐదు గంటలకు దామెర గ్రామ శివారులో ఉన్న బోడగుట్ట వద్ద చెట్టుకి ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుడి భార్య కడారి లచ్చమ్మ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించడం అయినది.

ఇ-పేపర్