జనం న్యూస్ 21 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ప్ర పంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మత్స్యకార సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు సింధనూర్ గంగాధర్ మత్స్యకారులు మన సమాజంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. చెరువులు కుంటలు నదులు జలాశయాలను ఆధారంగా చేసుకుని చేపల వేట చేపల పెంపకం ద్వారా ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ప్రజలకు పోషకాహారమైన చేపలను అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మత్స్యకారులు ఎంతో కృషి చేస్తున్నారు.కానీ నేటికీ అనేకమంది మత్స్యకారులు సరైన ఉపాధి చేపల విక్రయాలకు గిట్టుబాటు ధర వలలు పడవలు చేపల పెంపకానికి అవసరమైన సదుపాయాలు ఆర్థిక సహాయం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్లు మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కింది చర్యలు తీసుకోవాలని మా పార్టీ డిమాండ్ చేస్తోంది.
మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత ప్రకారం అందించాలి. చేపల వేటకు అవసరమైన వలలు, పడవలు, ఇతర పరికరాలను సబ్సిడీపై అందించాలి. చెరువులు కుంటల్లో చేపల పెంపకానికి మెరుగైన సదుపాయాలు కల్పించాలి. చేపల విక్రయాలకు సరైన మార్కెట్ సదుపాయాలు గిట్టుబాటు ధర కల్పించాలి మత్స్యకారులకు ప్రమాద బీమా ఆరోగ్య భద్రత ఆర్థిక భరోసా కల్పించాలి. మత్స్యకార యువతకు ఉపాధి అవకాశాలు శిక్షణ స్వయం ఉపాధి రుణాలు అందించాలి. మత్స్యకార మహిళలకు కూడా ప్రత్యేక ఆర్థిక సహాయం ఉపాధి అవకాశాలు కల్పించాలి ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని మత్స్యకార కుటుంబాల సమస్యలను ప్రభుత్వం సంబంధిత అధికారులు గుర్తించి వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి మా పార్టీ నినాదం చేపలు పట్టే చేతులకు గౌరవం ఇవ్వాలీ మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలి మత్స్యకారులు కేవలం చేపలు పట్టేవారు మాత్రమే కాదు. వారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వారి కష్టానికి తగిన గుర్తింపు గౌరవం న్యాయం లభించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాల మత్స్యకారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రజల పక్షాన నిలబడుతుంది మత్స్యకారులందరికీ మరోసారి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు సింధనూర్ ఉప్పరి గంగాధర్