తెలంగాణ

రెడ్డి ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటు

రెడ్డి ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటు

రాష్ట్ర అధ్యక్షుడిగా పట్లోళ్ల నాగిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక జనం న్యూస్ నవంబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి యాదాద్రి: రెడ్డి సంఘాల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రెడ్డి సంఘాల ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డి సంఘాల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలోని చిట్టి రెడ్డి రిసార్ట్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన రెడ్డి సంఘాల ప్రముఖులు, పెద్దలు హాజరయ్యారు. వారి సమక్షంలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏనుగు సంతోష్ రెడ్డి ప్రకటించారు. నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన పట్లోళ్ల నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్‌కు చెందిన సంధి తిరుపతిరెడ్డి ఎన్నికయ్యారు. రాష్ట్ర నూతన కార్యవర్గ వివరాలు: రాష్ట్ర అధ్యక్షులు:పట్లోళ్ల నాగిరెడ్డి – హైదరాబాద్రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి: సంధి తిరుపతిరెడ్డి – కరీంనగర్
రాష్ట్ర సహాధ్యక్షులు: నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి – కామారెడ్డి, బండ గోపాల్ రెడ్డి – కరీంనగర్రా ష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు:విరాటి దేవేందర్ రెడ్డి – వరంగల్, కొలిమి రాజ్ కుమార్ రెడ్డి – కరీంనగర్, పూర్మని లింగారెడ్డి – సిరిసిల్ల
రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరుళ్ల భూమిరెడ్డి – జగిత్యాల, రామన్న బాగారెడ్డి – మెదక్, పాండురంగారెడ్డి – సంగారెడ్డి, దొంగల బాపూ రెడ్డి – సిద్ధిపేట, పోసానిపల్లి మైపాల్ రెడ్డి – మేడ్చల్, ఏనుగు వెంకట్ రెడ్డి – నల్గొండ రాష్ట్ర అధికార ప్రతినిధి: చందిరి కొండల్ రెడ్డి – హైదరాబాద్ రాష్ట్ర సహాయ కార్యదర్శి:ఏలేటి రామ్ రెడ్డి – కామారెడ్డి రాష్ట్ర కోశాధికారి: గుర్రం పాపిరెడ్డి – రంగారెడ్డి రాష్ట్ర కార్యదర్శి: ఏలేటి భూమిరెడ్డి – కామారెడ్డి రాష్ట్ర ముఖ్య సలహాదారులు: మనోహర్ రెడ్డి – జగిత్యాల, మిన్కురి రామ్ రెడ్డి – కామారెడ్డి, సీహెచ్ సదాకర్ రెడ్డి – హైదరాబాద్. రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్‌గా: కందడి ప్రవీణ్ రెడ్డి – కామారెడ్డి. ఈ సందర్భంగా ఏనుగు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని అన్ని జిల్లాల రెడ్డి సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతను మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నూతన కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ సంఘం అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి సంఘాల ఐక్యతకు నూతన కార్యవర్గం కృషి చేస్తుందని, సంఘం లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు.

ఇ-పేపర్