జనం న్యూస్ 23 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్జో గులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులకు తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలి జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ నుంచి కాలేజీకి దూరం ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు ప్రతిరోజూ ఆటోలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ముఖ్యంగా విద్యార్థినులు, విద్యార్థులు సమయానికి కాలేజీకి చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆటో ప్రయాణాల వల్ల అదనపు ఖర్చులు సమయం వృథా కావడంతో పాటు విద్యార్థినుల భద్రత విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన డిమాండ్లు బస్టాండ్ నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలి ఉదయం, సాయంత్రం కాలేజీ సమయాలకు అనుగుణంగా బస్సులు నడపాలి విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి విద్యార్థుల రవాణా సమస్యను జిల్లా కలెక్టర్, ఆర్టీసీ అధికారులు సంబంధిత శాఖ అధికారులు వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారు కానీ రవాణా ఇబ్బందులతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి శాశ్వత బస్సు సౌకర్యం కల్పించాలి విద్యార్థుల సమస్య మా సమస్య వారి హక్కుల కోసం మా పోరాటం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు సింధనూర్ ఉప్పరి గంగాధర్.