రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడికి బీమా వర్తింపు – ఇంచార్జి సర్పంచ్ చాట్ల జనార్దన్, మాజీ మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి జనం న్యూస్, నవంబర్ 25: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంచార్జి సర్పంచ్ చాట్ల జనార్దన్, మాజీ మండల అధ్యక్షులు సోమదేవరెడ్డి ఆధ్వర్యంలో పథకానికి సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ పథకం రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ సభ్యుడికి వర్తిస్తుందని, 18 సంవత్సరాలు నిండిన వారి నుంచి 59 సంవత్సరాల వయస్సు వరకు అర్హత ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పథకంలో భాగస్వాములు కావాలని వారు కోరారు.ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, రేషన్ డీలర్లు, అంగనివాడి ఉపాధ్యాయులు, గ్రామ మహిళా సంఘాల సి ఏ లు మరియు ప్రజలు పాల్గొన్నారు.