ఆంధ్రప్రదేశ్

శాసనసభ్యుని సమక్షంలో ఘనంగా సాయి పుట్టినరోజు వేడుకలు

శాసనసభ్యుని సమక్షంలో ఘనంగా సాయి పుట్టినరోజు వేడుకలు

జనం న్యూస్ నవంబర్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ళలోని శాసనసభ్యుని పార్టీ కార్యాలయంలో ఈరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుట్టినరోజు వేడుకలను ఏర్పాటు చేసి, కేకు కోయించి గుత్తుల సాయికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గుత్తుల సాయి ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అదేవిధంగా మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గుత్తుల సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇ-పేపర్