ఆంధ్రప్రదేశ్

తడపాకల్‌లో నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

తడపాకల్‌లో నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సర్పంచ్ జె. స్వప్న అనిల్ కుమార్జ నం న్యూస్, నవంబర్ 25: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో నూతనంగా మంజూరైన పింఛన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను గ్రామ సర్పంచ్ జె. స్వప్న అనిల్ కుమార్ బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామంలో ఏ ఒక్క అర్హుడూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లోలపు రాజు, కార్యదర్శి రాకేష్, కారోబార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇ-పేపర్