హిందూ సమ్మేళన నిర్వహణ కార్యక్రమం:
జనం న్యూస్ 07 మే:- వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం కంకల్ గ్రామంలోని శ్రీ శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 8వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:00 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహించ నున్నట్లు నిర్వాహకులు హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ వేంకటదాసార్యుల వారు తెలిపారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక విలువలను పరిరక్షిస్తూ సమాజంలో ఐక్యతను పెంపొందించడం ఈ సమ్మేళనం ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి, ధర్మ పరిరక్షణ, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు యువతలో స్ఫూర్తి నింపే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక వక్తలు, సామాజిక నాయకులు, పండితులు పాల్గొని హిందూ ధర్మం గొప్పతనం, ప్రస్తుత పరిస్థితుల్లో సమాజ బాధ్యతలపై ప్రసంగాలు చేయనున్నారు. హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు వాటిని అధిగమించే మార్గాలపై కూడా చర్చలు జరుగ నున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ప్రతి హిందూ కుటుంబం ఈ సమ్మేళనంలో పాల్గొని ఐక్యతను చాటాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమ్మేళనంలో చత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు బైలూరి యోగేష్ ప్రభు గురూజీ, విశ్వ హిందూ పరిషత్ అనంతగిరి జిల్లా కార్యదర్శి శ్రీలత రెడ్డి, తెలంగాణ ప్రాంత గోసేన ప్రముఖ వెంకట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొననున్నారు.