తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రైతులకు అవగాహన కల్పించినా వ్యవసాయ అధికారి ప్రియదర్శిని
జనం న్యూస్ జున్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హుస్సేన్పల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ అనంతరం రైతులకు రైతు రిజిస్ట్రీ, పచ్చిరొట్ట ఎరువు విత్తనాల వినియోగం, అలాగే తెలంగాణ ప్రభుత్వం సూచించిన 8 రకాల వరి వంగడాల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మార్క ప్రియదర్శిని మాట్లాడుతూ రైతులు రైతు రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. పచ్చిరొట్ట ఎరువుల వినియోగం ద్వారా భూసారాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. అలాగే ప్రభుత్వం సిఫారసు చేసిన 8 రకాల వరి వంగడాలను సాగు చేయడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని వివరించారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నీటి వసతి ఖచ్చితంగా ఉన్న రైతులు మాత్రమే స్వల్ప కాల వ్యవధి కలిగిన వరి వంగడాలను ఎంపిక చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో శాయంపేట వ్యవసాయ విస్తరణ అధికారి జోష్ణ, హుస్సేన్పల్లి సర్పంచ్ యెడ్ల స్వరూప సుధాకర్, ఉపసర్పంచ్ లక్ష్మణ్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో రైతులు హాజరై రైతు సంక్షేమం, పంటల ప్రణాళిక భూసార పరిరక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన పొందారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మార్క ప్రియదర్శిని తెలియజేశారు…..