దళిత సంఘాలు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరలకు సంపూర్ణ సామాజిక భీమ్ ఆర్మీ

June 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 02 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; జోగుళాంబ గద్వాల్ జిల్లా జూన్ 1: భీమ్ ఆర్మీ మరియు వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గాలకు సంపూర్ణ సామాజిక సమానత్వం సాధించే వరకు మత స్వేచ్ఛ హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ గద్వాలలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రిక ప్రకటన లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మొరుగు వీరేష్ మాట్లాడుతూ, సమాజంలో కొందరు అధికార మదంతో అణగారిన వర్గాలను అణచివేయాలని ప్రయత్నిస్తే దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమవుతుందని హెచ్చరించారు. బీసీ, ఎస్సీ వర్గాల మధ్య విభేదాలు సృష్టించి తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలనే కుట్రలు కొందరు అగ్రవర్ణ శక్తులు చేస్తున్నాయని ఆరోపించారు.బీసీలు, దళితులు ఏకమైతే తమ రాజకీయ ఆధిపత్యానికి భంగం కలుగుతుందనే భయంతో కొందరు పెయిడ్ నాయకులను ముందుకు తెచ్చి ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. అనంతరం ఆ వర్గాల ప్రజలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం బానిసలుగా మార్చుకొని, తమ చెప్పుచేతల్లో ఉంచుకునే విధానాన్ని గత 78 సంవత్సరాలుగా దేశంలో చూస్తూనే ఉన్నామని అన్నారు.సామాజిక న్యాయం, సమాన హక్కులు, గౌరవప్రదమైన జీవనం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని వీరేష్ పిలుపునిచ్చారు. అగ్రవర్ణ రాజకీయ కుట్రలను తిప్పికొట్టి, రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం అణగారిన వర్గాలన్నీ సంఘటితంగా పోరాడాలని ఆయన కోరారు.ర్యాలీలో పాల్గొన్న నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, ఎస్సీ వర్గాలకు మత స్వేచ్ఛ హక్కు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, యువజన సంఘాలు మరియు జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper