జహీరాబాద్ నియోజకవర్గంలోని రాయిపల్లి డి గ్రామ సర్పంచ్ నూతన గృహ ప్రవేశ మహోత్సవం

May 8, 2026 | వైరల్ వార్తలు

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మే 08. 05. 2026 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని సర్పంచ్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సర్పంచ్ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం గృహప్రవేశ వేడుకలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అతిథులకు సత్కారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper