ఆపదలో ఉన్న మిత్రురాలికి అండగా నిలిచిన 95-96 10 క్లాస్ బ్యాచ్ విద్యార్థులు
జనం న్యూస్ జూన్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం స్కూలు రోజుల్లో విడదీయలేని స్నేహం.. దశాబ్దాల తర్వాత కూడా అదే ఆత్మీయతను కొనసాగిస్తూ, ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలుస్తున్నారు హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలో జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల 1995-96 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు. తోటి మిత్రురాలు గోరంటల రమాదేవి భర్త, శాయంపేట వాస్తవ్యులు సామల రఘు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపగా, ముగ్గురు కుమార్తెలతో ఒంటరైన ఆమెకు ఈ మిత్రబృందం కొండంత అండగా నిలిచింది. ‘ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులే మిన్న’ అని నమ్మే ఈ మిత్రులు, రమాదేవి కుటుంబానికి 17 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ గొప్ప మనసును చాటుకున్నారు. కేవలం ఈ ఒక్క సందర్భమే కాకుండా, గత రెండేళ్లుగా తమ బ్యాచ్‌లోని మిత్రులకు ఏ ఆపద ఎదురైనా ‘మేమున్నాం’ అంటూ ఆత్మీయ హస్తాన్ని అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోగిల బిక్షపతి, బుస్స శ్రీనివాస్, ఐలి సురేందర్, ఫైండ్ల లక్ష్మీపతి, డి. సంజీవరావు, ఫైండ్ల శంకర్, అన్న మహేందర్ పాల్గొని సహచర మిత్రురాలికి ధైర్యాన్ని అందించారు. స్నేహబంధానికి సమయం, దూరం అడ్డుకాదని, కష్టాల్లో ఉన్న మిత్రులను ఆదుకోవడమే నిజమైన స్నేహమని ఈ బృందం నిరూపించింది….