దాసులమ్మ, మరిడమ్మ, ముత్యాలమ్మలకు సారె సమర్పణ
జనం న్యూస్ జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంభక్తి శ్రద్ధలతో ఆషాఢ మాస వేడుకలు – చెయ్యేరులో ఆషాఢ మాసం సందర్భంగా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలోని శ్రీ దాసులమ్మ, మరిడమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్లకు శనివారం ఘనంగా సారె సమర్పణ కార్యక్రమం జరిగింది.తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు సంప్రదాయ వస్త్రాలతో అలంకరించుకుని అమ్మవార్లకు సారెను సమర్పించారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడంతో ఆలయం అంతా భక్తి పరిమళాలతో కళకళలాడింది. భక్తులు తమ మొక్కుబడుల మేరకు స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు తదితర పూజా సామగ్రిని తీసుకువచ్చి అమ్మవార్లకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో గ్రామ ప్రజలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవార్లకు పూజలు చేసి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం అంతా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో సాగింది.ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు సారె సమర్పించడం వల్ల గ్రామానికి సుభిక్షత, ఆరోగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.