గొర్రెల మందపై వీధి కుక్కల దాడి మూడు గొర్రెల మృతి, ఐ దు గొర్రెలకు తీవ్ర గాయాలు.

July 26, 2026 | తెలంగాణ

జుక్కల్ జులై 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో వాగ్మరే. హనుమంత్ గొర్రెల మందపై ఆదివారం తెల్లవారు జామున 20 వీధి కుక్కలు గుంపు గుంపుగా వచ్చి గొర్రెల మందపై దాడికి పాల్పడ్డాయి.ఈ దాడిలో గొర్రెల అరుపుకు గొర్రెల యజమాని పక్కకె పడుకొని ఉన్న వేరే కాపర్ల కూడా లేపి కుక్కలను తరిమేశారు. అప్పటికే మూడు గొర్రెలు చనిపోగా మిగతా ఐదు గొర్రెలు గాయాల పాలయ్యాయి. గొర్రెల కాపరితో పాటు గ్రామస్తులు కూడా వీధి కుక్కలపై స్థైర్య విహారం చేస్తూ ముగజీవులపై దాడికి పాల్పడుతుండటంతో ఒక పక్క పశువుల కాపరులు, మరోపక్క ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఇంతకుముందు కూడా అప్పుగొండ వార్. బస్సు గొండ కు చెందిన బర్రె దూడను తీవ్రంగా గాయపర్చి దాన్ని తోకను,చెవులను కొరికేసిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది.వీధిలో అభం శుభం తెలియని చిన్నారులు ఆడుకుంటుండగా వారి పరిస్థితి ఏంటని గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని గ్రామ సర్పంచ్.వి.రమణ సురేష్ గోండ జిల్లాస్థాయి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ కుక్కల బెడద నుండి కాపాడే విధంగా సంబంధిత అధికారులు తగుచర్యలు చేపట్టాలని గొర్రెల అధికారులకు విజ్ఞప్తి చేశారు.

🌐 Select Language:
📰 ePaper