డ్రంకెన్ డ్రైవింగ్ కేసులో ఏడుగురు వ్యక్తులకు జరిమానా

June 6, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 8 మందిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.2వ తరగతి ఇన్‌చార్జ్ మేజిస్ట్రేట్ అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నిందితులకు శిక్ష విధించారు. లోకలబోయిన అశోక్ జైలు శిక్షతో పాటు ₹1200 జరిమానా బొచ్చు రమేష్, చీర్ల నర్సింహారెడ్డి, మీటే మహేష్, జన్ను విజయ్ కుమార్, గుండ్ర సాంబయ్య, కొత్తకొండ భానుతేజ, బోలుగొడ్డు కార్తీక్ అనే మరో ఏడుగురికి మొత్తం ₹11,500 జరిమానా“మరోసారి మద్యం తాగి వాహనం నడిపితే నేరుగా జైలుకు పంపుతాం” అని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది.మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలతో పాటు కుటుంబాలు చెల్లాచెదరవుతాయని, ప్రజలు బాధ్యతగా ఉండాలని ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు

🌐 Select Language:
📰 ePaper