మార్టూరులో పోతులూరి వీరబ్రహ్మంస్వామివారిని దర్శించుకున్న ఎం వి ఆర్
జనం న్యూస్ జూన్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి: మండలం లోని మార్టూరు గ్రామంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త, బిజెపి నాయకులు, ఎం వి ఆర్ ట్రస్ట్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం వి ఆర్) స్వామివారిని దర్శించు కున్నారు. దీనిలో భాగంగా ఆలయ ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు మరియు స్థానిక మహిళలు మంగళ హారతులు ఇచ్చారు. ఈ మేరకు ఎం వి ఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదమంత్రాలతో ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా మార్టూరు గ్రామ బిజెపి ఉపాధ్యక్షుడు, ఆలయ కమిటీ సభ్యుడు ఈదలాడ బ్రహ్మాజీ పూలమాలతో ఎం వి ఆర్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమాన్ని ముత్యాల వెంకటేశ్వరరావు తన చేతుల మీదుగా ప్రారంభించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎం వి ఆర్ ట్రస్ట్ ఇంచార్జ్ గైపూరి రాజు, ముఖ్య అనుచరులు ఏపూరి వాసు, సత్తి మణికంఠ,సూరిబాబు తో పాటు ఎం వి ఆర్ సైనికులు మరియు గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.//