సైడ్ డ్రైనేజీ నిర్మాణం వేంటనే చేపట్టాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన బీ ఆర్ ఎస్ మండల నాయకుడు తరుణ్ గోపి

June 6, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మా గ్రామంలో శాయంపేట నుండి ఆత్మకూర్ మండలం వెళుతున్న రహదారికి సైడ్ డ్రైనేజ్ నిర్మాణం లేదు అంటూ వెంటనే చేపట్టవలసిందిగా అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వినతిఅందజేసిన బీ ఆర్ ఎస్ మండల నాయకుడు బేరుగు తరుణ్ గోపి అనంతరం మాట్లాడుతూ శాయంపేట గ్రామ ప్రజలు మా గ్రామంలో సరైన సైడ్ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో రోజువారి వర్షం నీరు మురికి నీరు రోడ్లపై నిల్వ ఉండి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగి ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతున్నారు ఎన్నోసార్లుగా మేము అధికారులకు వినతి పత్రం అందజేసిన పట్టించుకోవడం లేదు అట్టి నీరు వల్ల వేసిన సీసీ రోడ్డు దెబ్బతింటుందని రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గ్రామ పరిశుభ్రత కూడా దెబ్బతింటోంది.అందువల్ల సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను మంజూరు చేసి, వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము.మీరు మా వినతిని సానుకులంగాం పరిశీలించి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు చేపట్టి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము అని అన్నారు…..

🌐 Select Language:
📰 ePaper