కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఇచ్చే సబ్సిడీ విత్తనాల దుర్వినియోగం
జనం న్యూస్, జూన్ 8, వికారాబాద్ జిల్లా పరిగి, వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఇచ్చే సబ్సిడీ పల్లి విత్తనాలు దోమ మరియు కులక్చర్ల మండల రైతులకు ఇవ్వకుండా అక్రమంగా దారి మళ్ళించడం పై వ్యవసాయ శాఖ సంచాలకులను కలిసి బీఆరెస్ నాయకులు వివరణ కోరడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు వెంటనే సబ్సిడీ విత్తనాలను అందజేసి ఎరువులను పురుగుల మందులను సకాలంలో అందజేయాలనిఅక్రమంగా దారి మళ్లించిన విత్తనాలను వెంటనే రైతులకు అందజేయాలని లేనియెడల బీఆరెస్ పార్టీ తరఫున భారీ ఉద్యమం చేపడుతామని, అన్నారు. కొడంగల్ లో కూడా సబ్సిడీ విత్తనాల దుర్వినియోగంపై ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని తెలియజేశారుఅధికారులు, ఎమ్మెల్యే, చొరవ తీసుకోని దుర్వినియోగం అయినా విత్తనాల గురించి తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు లేని పక్షంలో రైతులకు బీఆరెస్ పార్టీ అండగా నిలబడుతుందని రైతుల తరపున ఆందోళన చేపడతామని తెలియజేశారుకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీ కరణం అరవింద్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, కౌన్సిలర్లు,చంద్రకళ, జాక్ రవికుమార్, మీది గడ్డ శ్రీనివాస్, వార్ల రవి, తాహెర్ అలీ, శశాంక్ రెడ్డి, నరేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ కృష్ణ, సేవియా నాయక్, మంగు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.