ప్రజా ప్రభుత్వంలోపేదల సొంతింటి కళ సాకారం మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్
జనం న్యూస్ 09జూన్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో దీకొండ లక్ష్మి శంకరయ్య దంపతులకుతెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రతిపాదన మేరకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు గృహప్రవేశం చేయగాస్థానిక సర్పంచ్ కుంటాల వనజ శ్రీనివాస్ తో కలిసిప్రారంభించిన పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో గత సంవత్సరం క్రితం నియోజకవర్గానికి 3500 లబ్ధిదారులకు పెగడపల్లి మండలం లోని వివిధ గ్రామాలకు 499 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా అట్టి ఇండ్లు ఇప్పటివరకు 75% పూర్తిచేసుకుని గృహప్రవేశం చేసుకున్నారని తెలిపారు. ఈ అవకాశం పేదలకు వరం లాంటిదని రాబోవు రెండున్నర సంవత్సరాలలో 2వ, 3వ, విడతల్లో ఇల్లు నిర్మాణం చేసుకునే పేదలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు లక్ష్మణ్ కుమార్ సహకారంతో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేపిస్తామని అన్నారు. గత సంవత్సరం మంజూరైన లబ్ధిదారులందరూ త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈఈ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి పద్మ, వార్డ్ సభ్యులు కుంటాల జమున లక్ష్మీకాంతం, ఉపాధ్యాయులు లింగంపెల్లి లచ్చయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు.