ఐహెచ్‌ఆర్‌ఆర్టీఐ కౌన్సిల్ నూతన శాఖ కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రజలందరికీ ఆహ్వానం

June 9, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని చిక్కుగుంట గ్రామంలో ఇండియన్ హ్యూమన్ రైట్స్ & ఆర్టీఐ కౌన్సిల్ నూతన శాఖ కార్యాలయాన్ని జూన్ 10వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఘనంగా ప్రారంభించ నున్నట్లు జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ సతీష్ కుమార్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ, సమాచార హక్కు చట్టం పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సామాజిక న్యాయం కోసం కృషి చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవడం లక్ష్యంగా ఈ నూతన శాఖ కార్యాలయం సేవలు అందించనుంది. సంస్థ విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమం సంస్థ వ్యవస్థాపకులు & చైర్మన్ పి. అఖిలేష్ రెడ్డి, జాతీయ అధ్యక్షులు కె. విజయ్ కుమార్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు ఎం. రాధా దేవి ఆశయాలకు అనుగుణంగా నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. మణుగూరు ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలందరూ విచ్చేసి, మానవ హక్కులు మరియు సమాచార హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థకు తమ మద్దతు తెలియజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి . కార్యక్రమ స్థలం: ఐహెచ్‌ఆర్‌ఆర్టీఐ కౌన్సిల్ నూతన శాఖ కార్యాలయం, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఎదురుగా,చిక్కుగుంట గ్రామం, మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ – 507117. ఆహ్వానితులు:శ్రీరామ్ సతీష్ కుమార్ & టీం జిల్లా అధ్యక్షులు, ఐహెచ్‌ఆర్‌ ఆర్టీఐ కౌన్సిల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.సంప్రదించవలసిన నంబర్: 7569344759

🌐 Select Language:
📰 ePaper