ఓట్లు వెరిఫికేషన్ లో ఓట్లు విలువను తెలియజేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ జూన్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ :భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఓటు ఒకటని, ఇది చాలా పవిత్రమైనదని రాష్ట్ర కేంద్ర భవిష్యత్తును నిర్ణయించి శాసనాలు చేసే హక్కును కల్పించేది ఓటని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. ఈరోజు ఉదయం 81వ వార్డులో బూత్ నెంబర్ 219 ఉమెన్స్ కాలేజీ రోడ్లో ఓట్లు వెరిఫికేషన్ చేస్తున్న బిఎల్ఓ బి ఎల్ ఎ తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లతో 2002లో ఓట్లు కలిగి ఉన్నారా 2024లో ఓట్లు వేశారా ఓటర్లను అడిగి తెలుసుకున్నారని కొత్తగా పెళ్లయిన వారు, 18 సంవత్సరాలు నిండిన వారు, చనిపోయిన వారు, అద్దెకు ఉండి వేరే ప్రాంతానికి వెళ్ళిన వారు వివరాలను ప్రతి ఇంటిలో అడిగి తెలుసుకునే తగిన సూచనలు చేశామని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ ఏజెంట్ చవరం శివ అప్పారావు బిఎల్ ఓ సరోజిని తెలుగుదేశం పార్టీ నాయకులు పెంటకోట శివరాం తదితరులు పాల్గొన్నారు.//