నందికొండలో విబిఎన్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేత
జనం న్యూస్- జూన్ 22- నాగార్జునసాగర్ టౌన్- సమాజంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం ఇతర అవసరాల్లో ఉండి దిక్కుతోచని స్థితిలో ఉన్న నిరుపేదలకు తామున్నామంటూ భరోసా ఇస్తుంది విబిఎన్ ఫౌండేషన్, నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్థానికంగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి, ఆపదలో ఉండి సాయం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరికి చేయూతనిస్తూ ఈ సంస్థ మానవత్వాన్ని చాటుకుంటుంది. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఉన్న నిరుపేదలు, వృద్ధులు మరియు అనాధలను గుర్తించి ఫౌండేషన్ ప్రతినిధులు వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తూ, అత్యవసర సమయాలలో వైద్య సేవలు అందేలా చొరవ చూపుతూ ఎందరో ప్రాణాలను కాపాడుతున్నారు.విబిఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ దాసరి నీనన్ మాట్లాడుతూ కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవటమే పరమావధిగా విబిఎన్ ఫౌండేషన్ పనిచేస్తుందని తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి తక్షణమే స్పందించడం మా బాధ్యతగా భావిస్తున్నామని వి బి ఎన్ ఫౌండేషన్ మరొక డైరెక్టర్ నూకల చెన్నారెడ్డి తెలిపారు, ఈరోజు నందికొండ మున్సిపాలిటీ 5వ వార్డుకు చెందిన మొగ్గ శ్రీను గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న వివిఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి నీనన్ తక్షణ వైద్య సేవల కోసం కొంత మొత్తాన్ని సహాయంగా అందించారు, ఈ కార్యక్రమంలో వల్లపు నాగార్జున, రాకం సైదేందర్(చిట్టి), మంజుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు,ఆపదలో ఉన్నవారి కన్నీళ్లు తుడుస్తూ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో వినూత్న సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న విబిఎన్ ఫౌండేషన్ నిర్వాహకులను పలువురు ప్రముఖులు, నందికొండ వాసులు అభినందిస్తున్నారు.