కొప్పిగుంట గ్రామ సచివాలయాన్ని అకస్మిక సందర్శన ఎంపీడీ ఓ బి రాజేశ్వరరావు

June 22, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూన్ 22 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొప్పిగుంట గ్రామ పంచాయతీ,స్వర్ణ గ్రామ సచివాలయాన్ని ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆకశ్మిక సందర్శన చేశారు. ఆయా స్వర్ణ గ్రామ సచివాలయం సిబ్బంది ఆన్లైన్ హాజరు వివరాలను నిశితంగా పరిశీలించారు. విధిగా సమయపాలన పాటించాలని,ప్రజనీకానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, పౌర సేవలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు.విధుల నిర్వాహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.సందర్శన లో కొప్పిగుంట పంచాయతీ కార్యదర్శి కిరణ్ & స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు*

🌐 Select Language:
📰 ePaper