అందమైన చేతిరాతను నేర్చుకోవడం సులభమే

May 11, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్; 11మే సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ వై.రమేష్;అందమైన చేతిరాతను సులభంగా నేర్చుకోవచ్చని ప్రముఖ చేతిరాత నిపుణుడు క్యాతం అశోక్ అన్నారు .సిద్దిపేట పట్టణంలోని దీక్ష పరివార్ స్కూల్లో ఏప్రిల్ 25వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు 15 రోజులపాటు చేతి రాశి శిక్షణ శిబిరం ఆహ్లాదంగా సాగింది. క్యాతం అశోక్ మాట్లాడుతూ తలరాతను మార్చడం కష్టం కావచ్చు కానీ చేతిరాతను మార్చుకోవడం సులభమని అన్నారు చేతిరాతవల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఏకాగ్రత క్రమశిక్షణ అలవడతుందని చెప్పారు వేసవి శిక్షణ శిబిరంలో తెలుగు హిందీ తో పాటు ఇంగ్లీషులో కర్సివ్ లుసీడా పద్ధతిలో మరియు డ్రాయింగ్ లను నేర్పారు చేతిరాతను విద్యార్థులు సులభ పద్ధతిలో నేర్చుకున్నారు డ్రాయింగ్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తితో పాటు ఏకాగ్రత పెరిగిందని అన్నారు 15 రోజుల చేతిరాత శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చేతిరాత అందంగా మారిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

📰 ePaper