జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాస్వామ్యం కావాలి… కాట్రేనికోన మండల ఎంపీడీఓ బి రాజేశ్వరరావు
జనం న్యూస్ జూన్ 26 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంకాట్రేనికోన మండలం కాట్రేనికోన 28.06.2026 న నిర్వహించ బోయే పోలియో ఆదివారం ను జయప్రదం చేయాలని ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు.నిండు జీవితానికి రెండు చుక్కలు చిన్నారుల ఆరోగ్యకర భవిష్యత్తుకి భరోసా అని ఈ సందర్భంగా తెలిపారు. గురువారం కాట్రేనికోన, పల్లంకుర్రు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఏ ఎన్ ఎమ్, అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలు అందరికీ ఆదివారం నాడు నిర్వహించబోయే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజానికి ప్రతిఒక్కరు కంకణబద్ధులు కావాలని ఈ సందర్భంగా ఎంపీడీఓ హితవుపలి కారు. 28న నిర్వహించ బోయే పోలియో శిబిరాల యందు అంగన్వాడీ, ఏ ఎన్ ఎమ్, ఆశా కార్యకర్తలు పూర్తి బాధ్యతతో సమర్ధవంతంగా పని చేయాలని, అలసత్వం వహించరాదని ఎంపీడీఓ ఆదేశించారు. కార్యక్రమంలో కాట్రేనికోన ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి ఎమ్ లిఖిత, మలేరియా సబ్ యూనిట్ అధికారి కె రామ్మోహన్ రావు, సూపర్ వైసర్ జె వి రమణమ్మ, పబ్లిక్ హెల్త్ నర్స్ జి రామశేషులు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
