బఫర్ జోన్లను కబ్జా వాగుల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు*
జనం న్యూస్ 26 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పొంచి ఉన్న ముంపు జిల్లా అధికారుల ఆదేశాలున్నప్పటికీ స్థానిక లీడర్ల జోక్యంతో పట్టించుకోని మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్లు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అయిజ మున్సిపాలిటీలో భూముల ధరలు పెరగడంతో వాగు ఒడ్డున భూములలో అక్రమ నిర్మాణాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.అక్రమ నిర్మాణాలకు అధికారుల అండ ఉండడంతో అధికారులు తాము గీసిందే గీత తాము రాసిందే రాత అనే విధంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి పట్టణ కేంద్రంలో అక్రమ నిర్మాణల కట్టడాలు జోరందుకున్నాయి అంబేద్కర్ సర్కిల్ ఎదురుగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణం పై జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎమ్మార్వో మరియు పురపాలక కమిషనర్ చర్యలు శూన్యం అవుతున్నాయి ఒకవైపు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ అవినీతి అక్రమాలను అంతం చేసే విధంగా ప్రజా పాలన దిశగా అడుగులు వేయాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలతో సమీక్ష సమావేశాలు జరిపి చర్యలు తీసుకోవాలని కోరిన పట్టణ మండల అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇందుకు నిదర్శనమే పట్టణంలోని