ఓటరు నమోదు ఫారమ్ల పంపిణీలో జాగ్రత్తలు పాటించాలి.ఎస్ఐర్ ప్రక్రియను పరిశీలించిన” ఆర్డీవో

June 26, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఓటరు నమోదు ఫారమ్ల పంపిణీలో జాగ్రత్తలు పాటించాలని భూపాలపల్లి ఆర్డీవో పి. హరికృష్ణ అన్నారు. ఈ మేరకు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారమ్ల పంపిణీ ప్రక్రియను ఎన్నికల నమోదు అధికారిగా ఆయన శాయంపేట మండలంలోని కొప్పుల, గంగిరేనిగూడెం, వసంతాపూర్, ప్రగతి సింగారం గ్రామాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆర్. ప్రవీణ్ కుమార్ తో కలిసి బీఎల్ఎలు, సూపర్వైజర్లకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి అర్హులైన ఓటర్లు ఎవరూ మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జీపీఓలు, బీఎల్ ఓలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper