అత్యవసర సమయంలో రక్తదానం చేసిన ప్రజాజ్యోతి రిపోర్టర్ ఓంకారి శ్రీనివాస్

June 29, 2026 | తెలంగాణ

జనం న్యూస్ , జూన్ 29, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణం లో మానవత్వాన్ని చాటుతూ అత్యవసర సమయంలో స్పందించి ఓ మహిళ ప్రాణాలను కాపాడేందుకు ప్రజాజ్యోతి రిపోర్టర్, సామాజిక సేవకుడు ఓంకారి శ్రీనివాస్ రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు. మెట్‌పల్లి పట్టణంలోని వెంకట అలేఖ్య నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న స్వప్న అనే మహిళకు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది. దీంతో పేషెంట్ కుటుంబ సభ్యులు రక్తదాతల అనుసంధానకర్త ఉదయ్ కుమార్‌ను సంప్రదించారు. ఆయన మెట్‌పల్లికి చెందిన ప్రజాజ్యోతి రిపోర్టర్, సామాజిక సేవకుడు ఓంకారి శ్రీనివాస్‌కు సమాచారం అందించారు.విషయం తెలుసుకున్న శ్రీనివాస్ వెంటనే స్పందించి బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేసి తన సేవా భావాన్ని చాటుకున్నారు. రెండు రోజుల క్రితమే తన రక్త గ్రూపు ఓ పాజిటివ్ అని, అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి సమయంలోనైనా రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉంటానని ఉదయ్ కుమార్‌కు ఫోన్ ద్వారా తెలియజేయడం విశేషం.అత్యవసర సమయంలో వెంటనే స్పందించి రక్తదానం చేసి ఓ కుటుంబానికి అండగా నిలిచిన ఓంకారి శ్రీనివాస్ సేవలను బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, రక్తదాతల అనుసంధానకర్త ఉదయ్ కుమార్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పేషెంట్ కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు.సమాజంలో మరింత మంది యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, రక్తదానం మహాదానం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని వారు కోరారు.

🌐 Select Language:
📰 ePaper