అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కొత్తగా పీజీ సైన్స్ కోర్సుల ప్రచార పత్రిక విడుదల
జనం న్యూస్ ; 29 జూన్ సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ కేంద్రం ఆర్ .సి. సి-015, సిద్ధిపేటలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ , పి.జి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిసారిగా ఎం.ఎస్సీ సైన్స్ విభాగంలో నాలుగు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి సునీత మరియు రీజనల్ కోఆర్డినేటర్ డా. ఎం శ్రద్ధానందం ప్రకటించారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి సునీత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అడ్మిషన్లకు సంబంధించిన గోడ/ప్రచార పత్రికను విడుదల చేశారు. సైన్స్ కోర్సులు మంజూరు చేసిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తగా ప్రారంభమైన కోర్సుల్లో ఎం.ఎస్సీ బోటనీ, జూవాలజీ, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఉన్నాయి. ఈ కోర్సులు సిద్ధిపేట మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో కీలకంగా నిలుస్తాయని వారు తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సునీత మరియు ప్రాంతీయ సమన్వయకర్త డా. ఎం. శ్రద్ధానందం మాట్లాడుతూ, ఉద్యోగాలు చేస్తున్నవారు, గృహిణులు మరియు ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారికి ఈ కోర్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం యూజీసీ గుర్తింపు పొందిన సంస్థగా, నాణ్యమైన దూరవిద్య, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, అందుబాటు ఫీజు నిర్మాణం మరియు సౌకర్యవంతమైన అభ్యాస విధానాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డా .జి పాపయ్య, వైస్ ప్రిన్సిపల్ డా. పి.అయోధ్య రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి డా.గోపాల సుదర్శనం కౌన్సిలర్లు బాలయ్య ,జి బాలకిషన్, రమశ్రీ,, బి. శ్రీకాంత్, వై .రమేష్, శ్రీనివాస్, అనిత మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం www.braou.ac.in� వెబ్సైట్ను సందర్శించవచ్చని, అలాగే 7382929615, 9704425028 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.