మారని మత్స్యకారుల బతుకులు..
సబ్ టైటిల్ :చేపల వేటకు వెళ్లాలంటే ట్రాక్టర్ కు రూ.500 చెల్లించాల్సిందే
జనం న్యూస్, జూన్ 30,అచ్యుతాపురం:సముద్రమే జీవనాధారంగా బతికే గంగపుత్రుల జీవితాలు..ఇప్పుడుఅలల తాకిడికి కొట్టుకుపోతున్నాయి. ఎన్నో ఆశలతో ప్రారంభమైనవేట సీజన్.. వారి ఆశలను ఆవిరి చేస్తూ కన్నీటి గాథగా మారుతోంది.వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టి సముద్రంలోకి చేపల వేటకు వెళ్తే, కనీసం డీజిల్ ఖర్చులుకూడా రాక,ఫైబర్ తెప్పలు, బోట్లను ఒడ్డున చేర్చేందుకు మరియు చేపల వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు కొద్దీ రోజుల నుండి ట్రాక్టర్ కు 500.రూ చెల్లించి చేపల వేటకు వెళ్లే పరిస్థితిని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులు ఎదుర్కొని చేపల వేట సాగిస్తున్నారు.ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ పూడిమడకలో ఫిషింగ్ హార్బర్, కోల్డ్ స్టోరేజీల కొరత వల్ల మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,హార్బర్ లేకపోవడం వల్ల చేపలను నిల్వ చేసుకోలేక,తీరంలో సముద్రపు ఆటుపోట్లను తట్టుకుని వేటాడినా, మత్స్య సంపదను భద్రపరుచుకునేందుకు సరైన సౌకర్యాలు లేవని,కొన్ని తరాలుగా చేపల వేటతోనే జీవితం సాగిస్తున్న సంప్రదాయ మత్స్యకార కుటుంబాలు కష్టాలకు ఎదురీదుతున్నాయని,మత్స్యకారుల కష్టాలను గుర్తించి బోట్లు నిలిపేందుకు ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు.
