ఏవీబీ పురం స్థానికుల సమస్యలను ప్రభుత్వ అధికారులు వెంటనే పరిష్కరించాలి జనసేన నాయకులు: ప్రేమ కుమార్
జనం న్యూస్ జూన్ 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఏవీబీ పురం వాసుల పిలుపు మేరకు నియోజక వర్గం జనసేన పార్టీ కంటెస్ట్ ఎంఎల్ఏ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ కాలనీ వెళ్లి ప్రెసిడెంట్ సింహాద్రి , ప్రధాన కార్యదర్శి వెంకట్ రావు మరియు స్థానికులు తో కలిసి కాలనీ లో తిరుగుతూ అక్కడ నివాసం ఉంటున్న వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ ఏవీబీ పురం లో మోరీలు నిత్యం పొంగుతున్నాయని, వర్షకాలం మరి ఎక్కువ సమస్యగా ఉందని, సుమారు వంద కుటుంబాలు నివాసం ఉంటున్న సెంట్ . రిటా హై స్కూల్ వెనుక,రోడ్ నంబర్ – 11 లొ మంజీర మరియు డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం బాధాకరం అని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించి నివాసులకు ఊరట నివ్వాలని కోరారు .ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, శివశంకర్ కాలనీ ఆర్. వాసు,గోవింద్,లక్ష్మీనారాయణ,బాబూరావు భాస్కర్ రావు, తిరుపతి,ప్రసాద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.