దీనబందు కాలనీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ఓటరు ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం

July 1, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి దీనబందు కాలనీ,ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా దీనబందు కాలనీలో నేటి నుంచి ఓటరు ధృవీకరణ (వెరిఫికేషన్) ప్రక్రియ ప్రారంభమైంది. కాలనీలోని కమిటీ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.కాలనీలోని అర్హులైన ఓటర్లందరూ తమ ఓటరు గుర్తింపు కార్డు (వోటర్ ఐడీ)తో కమిటీ హాల్‌కు వచ్చి వివరాలను ధృవీకరించుకోవాలని కోరారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయ వంతం చేయడానికి కాలనీ ప్రజలు సహకరించాలని, నిర్ణీత సమయంలోనే తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు

🌐 Select Language:
📰 ePaper