అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే టీఆర్ఆర్
జనం న్యూస్ జూలై 1, వికారాబాద్ జిల్లా పరిగి నియోజక వర్గం పరిగి పట్టణంలోని అయ్యప్ప కాలనీలో గల శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (సర్ ) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,, పరిగి నియోజకవర్గం మరియు వికారాబాద్ జిల్లా ప్రజలందరూ శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని,ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.అనంతరం ఆలయ వ్యవస్థాపకులు,శాశ్వత చైర్మన్ పాలాది శ్రీనివాస్ గుప్తా, మరియు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
