నడిరోడ్డుపై మద్యం విందు అనే కథనానికి స్పందించిన గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్
జనం న్యూస్ 02 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా లో మందుబాబులకు కౌన్సిలింగ్ పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌకు లో తేదీ 01.07.2026 నాడు రాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తూ ఉన్నారు అనే కథనానికి స్పందించారు గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్. ఈ సందర్భంగా కృష్ణవేణి చౌక్ లో బుధవారం రోజు రాత్రి బహిరంగంగా మందు సేవించిన వ్యక్తులను స్టేషన్ కి తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రధాన రోడ్డుపై మద్యం సేవించినట్లయితే చర్యలు తప్పవని కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ప్రధాన రోడ్లపై మద్యం సేవించినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.