‘ అయోధ్య’ రామమందిర్లో హుండీ దోపిడి గురించి బి జీ పి నేతలు సమాధానం చెప్పాలి

July 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 02 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : అయోధ్య రామ్ మందిరంలో హుండీ కానుకల దోపిడీ వ్యవహారంలో ప్రధాని మోడీ వెంటనే రాజీనామా చేయాలి.దేవుని పేరు చెప్పి ఆస్తులు సంపాదిస్తూ ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసు కుంటున్న బిజెపి దొంగ నేతలుమాజీ యం పి టి సి సభ్యులు బుద్వేలు మంజుల మల్లేష్ గౌడ్ పర్వతాపూర్ అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల సొమ్ము హుండీ నగదు చోరీకి గురైన వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సేకరించిన కీలక సమాచారం మరియు దర్యాప్తు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:కేసు నేపథ్యం దర్యాప్తు ఇంటి దొంగల పని: ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను హుండీ నగదును లెక్కింపు చేసే సిబ్బందే ఈ దొంగతనానికి పాల్పడ్డారు.8 మంది అరెస్ట్ ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసింది. వీరిలో ఆరుగురు విరాళాల నగదు లెక్కించే ఒప్పంద ఉద్యోగులే ఉన్నారు.కోట్లలో చోరీ ఆరోపణలు: హుండీ లెక్కింపు సమయంలో సుమారు ₹7 కోట్ల నుండి ₹7.5 కోట్ల వరకు నగదు మాయమై ఉంటుందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. అయితే, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ స్కామ్ విలువ ₹200 కోట్ల వరకు ఉండవచ్చని ఆరోపిస్తున్నారు.నగదు రికవరీ: నిందితుల నుంచి ఇప్పటివరకు ₹79.85 లక్షల నగదును, అలాగే కొన్ని విలాసవంతమైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు ప్లాన్ వేసింది ఎలా?సీసీటీవీ బ్లైండ్ స్పాట్స్: నిందితులు ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాల కదలికలను ముందే గమనించి, కెమెరాల నిఘా పడని ప్రదేశాలను వాడుకున్నారు.హ్యూమన్ షీల్డ్ మానవ హారంలెక్కింపు గదిలో ఒకరు డబ్బు దొంగిలిస్తుంటే, మిగిలిన వారు కెమెరాలకు కనిపించకుండా చుట్టూ గుమిగూడి అడ్డుగా నిలబడేవారని దర్యాప్తులో తేలింది.వాష్ రూమ్‌లలో దాచి: దొంగిలించిన సొమ్మును మొదట ఆలయ వాష్ రూమ్‌లలో దాచి, ఆ తర్వాత సమయం చూసుకుని బయటకు తరలించేవారని సమాచారం.కుంభమేళా సమయంలో భారీ దోపిడీ: 2025 ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సమయంలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని నిందితులు లవకుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రాలు అత్యధికంగా డబ్బులు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు…అయితే ఈ సంఘటనలో ప్రధాని మోదీ నీ షరతుతుగా తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు

🌐 Select Language:
📰 ePaper