తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసిన చేనేత సహకార సంఘం సభ్యులు

July 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘానికి చెందిన భూమిపై ఎలాంటి అక్రమ జోక్యం, వ్యక్తిగత హక్కుల చెల్లుబాటు ఉండదని పేర్కొంటూ సంఘం సభ్యులు మండల తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారువివరాల్లోకి వెళ్ళితే సర్వే నంబర్లు 358/సి/, 355/బి లో ఉన్న మొత్తం 4 ఎకరాల 34 గుంటల భూమి చేనేత సహకార సంఘానికి చెందిన ఉమ్మడి ఆస్తి అని తెలిపారు. ఈ భూమిపై సంఘ సభ్యులందరికీ సమాన హక్కులు ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎవరూ హక్కులు చెలాయించే అధికారం లేదని స్పష్టం చేశారు. సంఘ భూమికి సంబంధించిన అన్ని రికార్డులు, సంబంధిత పత్రాలను తహాసీల్దార్ కు అందజేశారు సభ్యులు, భూమిపై ఎలాంటి అక్రమ లావాదేవీలు, ఆక్రమణలు లేదా బదిలీలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చేనేత సహకార సంఘం ఆస్తిని పరిరక్షిస్తూ చట్టబద్ధంగా న్యాయం చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో చేనేత సంఘం సభ్యులు బసాని చంద్ర ప్రకాష్ దాసరి సమ్మయ్య సామల బుజ్జన్న బసాని లక్ష్మినారాయణ బసాని చంద్రమౌళి బుర లక్ష్మి నారాయణ బసాని విద్యాసాగర్ బసాని నావీణ్ తదితరులు పాల్గొన్ని తహాసీల్దార్ కు వినతిపత్రాన్ని అందజేశారు…..

🌐 Select Language:
📰 ePaper